మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం మార్పుపై పలు ఊహాగానాలు సాగుతున్నాయి. ఈడీ కస్టడీలో మాదిరిగానే కేజ్రీవాల్ జైలు నుంచి కూడా పరిపాలన కొనసాగిస్తారని ఆప్ నేతలు చెబుతున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ఆయన స్థానంలో ఎవరు బాధ్యతలు చేపడతారని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వాన్ని నడిపించే నాయకుడు ఎవరు? అనేది తీవ్ర చర్చ జరుగుతోంది. దీంతో తెరపైకి కొంత మంది పేర్లు వస్తున్నా, అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత పేరు ఎక్కువగా వినిపిస్తోంది. భవిష్యత్తులో సునీతా కేజ్రీవాల్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తారని ఆప్ వర్గాలు అంటున్నాయి. అయితే ఇప్పటి వరకు సునీత కేజ్రీవాల్ రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత నుంచి ఆమె తన భర్తకు మద్దతుగా మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమి ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీలో సునీత పాల్గొనడంతో ఇదే ఆమె రాజకీయ ప్రవేశంగా భావిస్తున్నారు.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post