ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన లాయర్‌తో కలిసేందుకు అనుమతి కోరుతూ చేసిన దరఖాస్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టులో వ్యతిరేకించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నందున ఆయనకు ప్రత్యేక మినహాయింపు ఇవ్వలేమని ఈడీ స్పష్టం చేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ , ఈడీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు ఈడీ ఈ వాదనలు చేసింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ దరఖాస్తుపై ఉత్తర్వులను కోర్టు సోమవారానికి రిజర్వ్ చేసింది. అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వారానికి ఒక గంట సమావేశ సమయం సరిపోదని కేజ్రీవాల్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. సంజయ్ సింగ్ పై ఐదు లేదా ఎనిమిది కేసులున్నప్పటికీ ఆయనను కలిసేందుకు మూడుసార్లు అనుమతించామని ఈడీ తెలిపింది. ఇది జైలు నిబంధనలను ఉల్లంఘించడమేనని, ప్రతివారం ఐదుసార్లు తన లాయర్‌ను కలిసేందుకు అనుమతించాలన్న కేజ్రీవాల్ అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించింది.
Discussion about this post