నెల్లూరులో అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. వారి సమ్మె తొమ్మిదో రోజుకు చేరుకున్న నేపథ్యంలో అంగన్ వాడీ కేంద్రాల తాళాలు పగులకొట్టి వాటి నిర్వహణ కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించడంపై కార్యకర్తలు, ఆయాలు, ఐద్వా నేతలు మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణను చూసి నేర్చుకోవాలని చెప్పారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలనే నెరవేర్చమంటున్నామని అన్నారు. డిమాండ్లు నెరవేరేవరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Discussion about this post