ఖమ్మం నగరంలో ఖానాపురం హవేలీ చెరువు లోని అక్రమ నిర్మాణాలను నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చి వేశారు. వీటితో పాటు రిజిస్ట్రేషన్ భూమిలోని ఇంటిని కూడా కూలగొట్టడంతో బాధితుడు మాడు వెంకన్న లబోదిబో మంటున్నాడు. 2009లో రిజిస్ట్రేషన్ భూమిని కొనుగోలుచేశానని, తర్వాత అధికారులు నోటీసులు జారీ చేయగా, హైకోర్టును ఆశ్రయించానన్నాడు.. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. మునిసిపల్ అధికారులు కూడా నోటీసులు ఇచ్చారని వాటికి వివరణ ఇచ్చినా.. పండుగ రోజుల్లో అధికారులు తన ఇంటిని కూల్చివేశారంటూ ఆవేదన చెందుతున్నాడు.
Discussion about this post