తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం షార్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన శ్రీహరికోటకు చేరుకున్నారు. స్పేస్ డే ఈవెంట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం రాకెట్ ప్రయోగ వేదికను ఆయన పరిశీలిస్తారు. ఆయన తిరుగు పయనమవుతారు. కాగా పవన్ పర్యటనకు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఇస్రో ఆధ్వర్యంలో గత నెల 14 నుంచి ఈ నెల 15 వరకు జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ వేడుకలు ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, గుంటూరులలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
Discussion about this post