ఉగాదిని పురస్కరించుకొని సూళ్లూరుపేట చంగాలమ్మ శాఖాంబరిగా దర్శనమిచ్చారు. చందన శోభిత,సర్వాభరణ సుందరంగా దర్శనమిచ్చారు. తెలుగు వైభవం ఉట్టి పడే విధంగా అమ్మవారిని అలంకరించారు. ఉగాదిని పురస్కరించుకుని భక్తులు చంగాలమ్మను దర్శించుకొనేందుకు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దేవాదాయశాఖ కార్యనిర్వహణ అధికారి డి వెంకటేశ్వర్లు క్యూలైన్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.
Discussion about this post