తెలంగాణ ఆదివాసీల జాతర మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి భక్తులు మేడారంకు చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
మేడారం జాతర : మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆసియా ఖండంలోనే ప్రత్యేకమైన జాతర. ఈ జాతరలో కోట్లాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. జాతరకు వచ్చే భక్తులు జంపన్న వాగుకు పూజలు చేసి ముందుగా సమ్మక్క, సారలమ్మలకు పూజలు చేసి వాగులో స్నానాలు ఆచరించి సమ్మక్క సారలమ్మ గద్దెలకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. జంపన్న వాగులో స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారని, గిరిజన యోధుల ధైర్యసాహసాల వల్ల జంపన్న వాగులో స్నానం చేసిన ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నమ్మకం.
Discussion about this post