వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవాలయాలన్నీ తెల్లవారు జామునుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధిగాంచిన మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్దిస్తాయని భక్తుల విశ్వాసం.
Discussion about this post