నెల్లూరులో పార్వేట మహోత్సవం: కనుమ పండుగను పురస్కరించుకుని నెల్లూరులో పార్వేట వనమహోత్సవం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా భ్రమరాంబిక సమేత మల్లిఖార్జున స్వామి జలవిహారం నిర్వహించారు. విద్యుత్ దీపాలు, వివిధ రకాల పూలతో అలంకరించిన విగ్రహాలను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. పెన్నా నది దిగువ కాలువ మైపాడు గేటు వద్ద భ్రమరాంబికసమేత మల్లికార్జున స్వామి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. శివుని దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు.
Discussion about this post