లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని పార్టీలు పలుకుబడి ఉన్న వ్యక్తుల కోసం ఎదురు చూస్తున్నాయి. అందులో భాగంగా వివాదరహితుడైన సినీ పరిశ్రమకు చెందిన దిల్ రాజును రెండు జాతీయ పార్టీలు సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు ఆయన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే అవన్నీ బేస్ లెస్ గా తేలిపోయాయి.
ప్రస్తుతం దిల్ రాజును రాజకీయాల్లోకి తెచ్చేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన అనేక సక్సెస్ సినిమాలను రూపొందించారు. వివాదరహితుడిగా పేరుండటంతో అన్ని పార్టీలు ఆయనకు టికెట్ ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. కాంగ్రెస్ ఆయన స్వంత ప్రాంతం అయిన నిజామాబాద్ లోక్ సభ స్థానంలో పోటీ చేయించడానికి సన్నాహాలు చేస్తుండగా, బీజేపీ జహీరాబాద్ నుంచి పోటీచేయించేదుకు ప్రయత్నిస్తోంది. అయితే దిల్ రాజు ఇంతవరకు రాజకీయాల్లోకి వెళ్లాలా ? వద్దా ? అనేది నిర్ణయించుకోలేదని… సన్నిహితులు చెబుతున్నారు.
























Discussion about this post