అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే రావులపాలెం ను పూర్తిస్థాయిలో అభివృద్ది చేస్తానని ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో బండారు సత్యానందరావు తెలిపారు. రావులపాలెంలో బార్ సంస్కృతి తీసుకొచ్చింది వైసీపీ అని ఆయన మండిపడ్డారు. అరటి మార్కెట్ ను రావులపాలెంలో ఏర్పాటు చేసి అభివృద్ధికి బాటలు వేశానని కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం,జనసేన,భాజపా కూటమి అభ్యర్థి సత్యానందరావు అన్నారు.
రావులపాలెంలో అంకాలమ్మ గుడి ఏరియాలో జరిగిన ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరటి మార్కెట్టే కాదు కొత్తకాలనీలను తీసుకిచ్చి రావులపాలెంను అభివృద్ధి చేశానని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాత్రం నిబంధనలు విరుద్దంగా బార్ సంస్కృతిని తీసుకొచ్చారని గుర్తుచేసారు. మరలా ఒకసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే గా గెలిపిస్తే రావులపాలెంను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని సత్యానందరావు కోరారు.
Discussion about this post