తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయినా హామీలు అమలు కావడం లేదని పాలమూరు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ సమైక్య శక్తి’ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులెవరూ స్థానికులు కాదన్నారు. రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న మాటలే తప్ప చేతలు లేవని ఆమె కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. దేశంలో చేపట్టిన అభివృద్ధి పథకాలను గడపగడపకు చేరవేయాల్సిన బాధ్యత ప్రతి మహిళది అని అరుణ అన్నారు.
Discussion about this post