నాసా అంతరిక్ష పరిశోధకులు గ్రహాంతరవాసుల కోసం వెతుకుతున్నారు. అనంత విశ్వంలో మానవులను పోలిన జీవులున్నాయేమో అని జల్లెడపడుతున్నారు. సూర్యకుటుంబంలోని అతి పెద్ద గ్రహమైన గురుగ్రహ చంద్రుడిపై కూడా పరిశోధనల ప్రారంభించారు. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ విశ్వంలో మానవులం ఒక్కరమే ఉన్నామా ? ఇంకా మనలాంటి వారున్నారా? అని తెలుసుకోవడానికి గురుగ్రహ చంద్రుడు యూరోపా పై ‘క్లిప్పర్ మిషన్’ ను ప్రయోగిస్తున్నామని ప్రాజెక్టు సైంటిస్ట్ బాన్ పప్పలార్డో అన్నారు. గురుగ్రహ చందమామ యూరోపా పై ప్రాణుల సంచారం ఉందా ? జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయా అని శోధిస్తున్నామన్నారు. విశ్వంలో జీవం ఎలా వచ్చిందన్న విషయంపై పరిశోధనలు చేస్తున్నామన్నారు. దీనిపై కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ ఇప్పటివరకు 5 బిలియన్ డాలర్లతో పరిశోధనలు జరుపుతోంది. శాటిలైట్ ద్వారా భూమిపై ఉన్న సూక్ష్మ జీవులు అక్కడికి వెళ్లకుండా చూస్తున్నారు.
ఫ్లోరిడాలోని కెన్నడి స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేయడానికి క్లిప్పర్ ను సంసిద్దంగా ఉంచారు. దీని ద్వారా స్పేస్ ఎక్స్ ఫాల్కన్ హెవీ రాకేట్ ను పంపుతున్నారు. ఇది ఐదేళ్లు మార్స్ మీదుగా ప్రయాణించి గురువు ఉపగ్రహమైన యూరోపాపైకి వెళ్లనుంది. 2031 నాటికి అది జూపిటర్ ఇంకా యూరోపా కక్ష్య లోకి చేరుకుంటుంది. యూరోపా గడ్డకట్టిన నీళ్లతో కప్పబడి ఉందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. గడ్డకట్టిన ఐస్ నుంచి కూడా లోపలి భాగాలను ఫోటో తీయగల కెమేరాలు, స్పెక్ర్టోమీటర్లు, మాగ్నోమీటర్, రాడార్లను శాటిలైట్ లో అమర్చామని పప్పలార్డో చెప్పారు. భూగోళంపై ఉన్న ప్రత్యేక పరిస్థితులు అంటే ఉత్తర దక్షిణ ధృవాలపై సూర్య కిరణాలే పడవు. అవి రెండూ భూమికి రెండు టోపీల్లా పనిచేస్తాయి. అయితే యూరోపా మీద పరిస్థితులు మన చంద్రుడిపై ఉన్నట్టే ఉన్నాయా ? లేదా వేరే విధంగా ఉన్నాయా అని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు తహతహ లాడుతున్నారు.
గ్రహాలకుండే ఉపగ్రహాలు నక్షత్రాలకు దూరంగా సంచరిస్తే ప్రాణికోటి ఉండే అవకాశం ఉందని యూరోపా క్లిప్పర్ మిషన్ ప్రాజెక్టు మేనేజర్ జోర్డాన్ ఇవాన్స్ తెలిపారు. అయితే అక్కడి కెళ్లడం అనుకున్నంత తేలిక కాదు. యూరోపా చుట్టూ శక్తివంతమైన రేడియేషన్ క్షేత్రం ఉంటుంది. ఇది లక్ష చెస్ట్ ఎక్స్ రేలకు సమానం. క్లిప్పర్ డేటాను పంపాలంటే మిషన్ కంట్రోల్ సిగ్నల్ కోసం 45 నిముషాలు ఆగాల్సి ఉంటుంది. ఈ మిషన్ 1990 చివర్లలో ప్రారంభం అయినప్పటికీ 2034 నాటికి పూర్తవుతుంది. తద్వారా విశ్వాంతరాళంలో ఎక్కడైనా జీవకోటి ఉంటే తెలుస్తుంది.
Discussion about this post