తక్కువే ఇచ్చారంటున్న టాలీవుడ్ వర్గాలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ‘సలార్’పై అటు పరిశ్రమ వర్గాల్లోనూ, ఇటు అభిమానుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 22 న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదలవుతోంది.
అయితే ఈ సినిమాకి ప్రభాస్ కి ఇచ్చిన పారితోషికం ఎంతనేదానిపై టాలీవుడ్లో చర్చ జరుగుతోంది.
ప్రభాస్ ప్రతి సినిమాకి 100 కోట్ల రూపాయలపైనే తీసుకుంటున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘బాహుబలి’ సూపర్ డూపర్ హిట్ తర్వాత డార్లింగ్ సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలవడం, బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ వస్తుండటంతో ప్రభాస్ అడిగినంత పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు వెనకాడటం లేదు. అయితే ‘సలార్’ మూవీకి మాత్రం అంత పారితోషికం ఇవ్వలేదనే వార్త ప్రచారంలో ఉంది.
‘సలార్’ సినిమాను రెండు పార్టులుగా తీస్తుండటంతో వేర్వేరుగా అయితే ఎక్కువ పారితోషికం ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో నిర్మాణ సంస్థ, దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండు పార్టులను ఒకేసారి పూర్తి చేసేశారని అంటున్నారు. ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్ పాత్ర ఎక్కువగా కనిపిందని.. అందుకే సినిమా ప్రచారానికి కొంచెం దూరంగా వున్నారని అంటున్నారు. మరోవైపు
యూఎస్ మార్కెట్ లో ప్రభాస్ కు మంచి క్రేజ్ ఉండడంతో బుకింగ్స్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో హాఫ్ మిలియన్ మార్క్‌ని క్రాస్ చేసేసింది. రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఆదిపురుష్ తర్వాత ప్రస్తుతం నాలుగు సినిమాలను చేస్తున్నారు. అందులో సలార్ ఒకటి. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పని పూర్తైయినట్టు చెబుతున్నారు. సినిమా రన్ టైమ్ 2 గంటల 55 నిమిషాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, పృథ్విరాజ్ సుకుమారన్, శ్రీయా రెడ్డి ముఖ్య పాత్రల్లో కనపడనున్నారు.
Discussion about this post