ప్రముఖ భారతీయ జ్యోతిష్య నిపుణులు కుశాల్ కుమార్ రాబోయే 48 గంటల్లో ప్రపంచం లో పెను విధ్వంసాలు జరగనున్నాయని అంచనా వేశారు. అత్యంత బలమైన గ్రహాల సంఘర్షణ కారణంగా.. జూన్ 18వ తేదీన ఈ విధ్వంసం మొదలవుతుందని, ఇది ప్రపంచవ్యాప్తంగా పెను విధ్వంసాన్నే సృష్టించబోతోందని కుండబద్దలు కొట్టారు. ఉత్తర-దక్షిణ కొరియా, చైనా-తైవాన్, ఉక్రెయిన్-రష్యా, మిడిల్ ఈస్ట్‌లలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని.. ఇవన్నీ ఆ పెను విధ్వంసానికి ప్రారంభ సంకేతాలని చెప్పారు.
కుశాల్ కుమార్.. హర్యానాలోని పంచకుల సెక్టార్ 20లో ఆయన నివసిస్తుంటారు. ‘న్యూ నోస్ట్రాడమస్’గా పేరొందిన ఆయన.. ‘వేద జ్యోతిషశాస్త్ర చార్ట్’ను ఉపయోగించి ముఖ్యమైన ప్రపంచ సంఘటనలను అంచనా వేస్తుంటారు. ఈ చార్ట్‌ని ‘మ్యాప్ ఆఫ్ అవర్ కర్మ’ అని నమ్ముతారు. గ్రహాలు, నక్షత్రాల అమరికల ఆధారంగా ఈ చార్ట్‌ని సిద్ధం చేశారు. రాబోయే 48 గంటలు ఎంతో క్లిష్టమైనవని.. ఆకాశం నుంచి ఉపగ్రహాలు కిందికి దూసుకొస్తాయని.. అడవులు బూడిదగా మారుతాయని.. అన్ని దేశాలు ఒకదానితో మరొకటి పోరాటానికి దిగుతాయని.. ఈ యుద్ధం ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుందని కుశాల్ కుమార్ వివరించారు. మే నెలలోనే ఈ అంచనా వేసిన ఆయన.. గత నెలలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంపై కూడా మాట్లాడారు. అలాగే.. భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉగ్రదాడులు భీకర స్థాయిలో జరుగుతాయని హెచ్చరించారు. అందుకు.. జూన్ 9న రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడిని ముందస్తు సూచనగా పేర్కొన్నారు.ఇజ్రాయెల్-హమాస్, చైనా-తైవాన్, రష్యా-నాటో మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయని ఆయన గతంలోనే అంచనా వేయగా.. అవి నిజమయ్యాయి. కొందరు నాయకులు తీవ్రంగా అస్వస్థతకు గురికావడమో లేదా రాజీనామా చేయడమో వంటి జరిగే అవకాశం కూడా ఉందన్నారు.
ఈయనని న్యూ నోస్ట్రాడమస్ గా అభివర్ణిస్తారు .నోస్ట్రాడమస్ ఒక ఫ్రెంచ్ జ్యోతిష్కుడు. ఆయన 1503 డిసెంబర్‌లో జన్మించారు. 942 పద్యాలు గల ‘లెస్ ప్రొఫెటీస్’ పుస్తకంతో ఆయన ప్రసిద్ధి చెందాడు. రెండు వేర్వేరు పుస్తకాల్లో ప్రచురించబడిన ఈ పుస్తకాల్లోని పద్యాలను ప్రవచనాలుగా నమ్ముతారు. ఆయన ముందుగానే అంచనా వేసిన కొన్ని సంఘటనలు నిజమయ్యాయని ఫాలోవర్స్ నమ్ముతారు. గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్, ఫ్రెంచ్ విప్లవం, నెపోలియన్ – అడాల్ఫ్ హిట్లర్‌ల ఎదుగుదల, మొదటి – రెండవ ప్రపంచ యుద్ధాలు, హిరోషిమా-నాగసాకి అణు విధ్వంసం, 1969లో అపోలో మూన్ ల్యాండింగ్, 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడులు వంటివి ఆయన అంచనా వేసినట్లు చెప్తున్నారు.
Discussion about this post