ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హనుమకొండ జిల్లా హరిత హోటల్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. మాదిగలందరు బీజేపీకి ఓటు వేయాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలో మాదిగలకు భవిష్యత్ లేదని అన్నారు. నవంబర్ 11న మాదిగల విశ్వరూప మహాసభ వేదిక మీద నుండే నో కాంగ్రెస్, నో బీఆర్ఎస్ అని పిలుపిచ్చానని,ఆ పార్టీల నాయకులను మాదిగల పల్లెలకు రానివ్వద్దని చెప్పారు. కాంగ్రెస్ అగ్ర నాయకులు మాదిగల ఓట్లను అడిగే హక్కును కోల్పోయారని, కాంగ్రెస్ పార్టీ మాదిగలకు మొండి చేయి చూపించిందని అన్నారు.
Discussion about this post