రాళ్లు విసిరి రాజకీయం చేయాల్సిన స్థాయి టీడీపీ నేతలకు, కార్యకర్తలకు లేదని మాజీ ఎమ్మెల్యే…గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రజల మనోభావాలు కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సబబు కాదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించే సమయంలో పవర్ కట్ చెయ్యడం ఏపీలోనే చూస్తున్నామని చెప్పారు. అదే సమయంలోనే రాళ్లతో దాడి జరగడం చూస్తుంటే దాడి ఎలా జరిగిందో…ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి పట్ల అనుమానాలు ఉన్నాయంటున్న గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు
Discussion about this post