ఆర్టీసీ బస్సులు చాలక ప్రయాణికుల పాట్లు
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అటు ప్రయాణీకులకు, ఇటు ఆర్టీసీ సిబ్బందికి చుక్కలు చూపిస్తోంది. రద్దీ పెరిగి బస్సులు చాలకపోవటంతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ప్రయాణికులు బస్సుల వెనక ఉండే స్టాండ్ పట్టుకొని వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. తమ ఊరికి ఉన్న లాస్ట్ బస్సు ఎక్కలేక ఓ యువతి బోరున విలపించింది.
కొన్నిచోట్ల బస్సులు ఆపడం లేదంటూ ప్రయాణీకులు దాడులు చేస్తున్నారని ఆర్టీసీ అద్దె బస్సుల డ్రెవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణికుల దాడికి నిరసనగా జిల్లా కేంద్రం మెదక్ లో బస్సులను నిలిపి వేసి డిపో ముందు ధర్నాకు దిగారు. తమ సర్వీసును రెగ్యులర్ చేస్తూ తగిన రక్షణ కల్పిస్తేనే బస్సులను నడుపుతామని డ్రైవర్లు చెప్పారు. ఫుట్ బోర్డు పై ప్రయాణించేవారికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.
Discussion about this post