ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తానని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సరిపడా టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడుతున్నామని, పాఠశాల వెనుక భాగాన కాంపౌండ్ వాల్ లేదని వారు చెప్పారు.
పాఠశాలను పరిశీలించిన అనంతరం చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. త్వరలోనే నియోజకవర్గంలోని హాస్టళ్లను సందర్శించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Discussion about this post