వైసీపీ నాయకు ల వరుస లీలలతో పార్టీ నిత్యం అప్రదిష్ట మూటకట్టుకుంటోంది . విజయసాయి రెడ్డి లీలలు మర్చిపోక ముందే, ఇప్పుడు మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది వైసిపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధం పెట్టుకోవటం పై, ఆయన కుమార్తెలు రోడ్డెక్కారు. వేరే మహిళతో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటి ముందు, ఇద్దరు కుమార్తెలు నిరసన తెలిపారు. మా నాన్నని కలవడానికి వెళితే కనీసం డోర్స్ కూడా తీయలేదని దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె బాధపడ్డారు.
మూడు రోజులుగా జిల్లాల్లో హాట్ టాపిక్ గా మారిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం పై శ్రీనివాస్ మీడియా ముందుకు వచ్చారు. తన భార్య దువ్వాడ వాణి అధికార, డబ్బు ఆకాంక్షతో తన పిల్లలను తనపై ఉసి గొల్పించిందని ఆరోపించారు. వారు ఉండేందుకు ఆరు కోట్ల రూపాయలతో ఇల్లు కట్టించి ఇచ్చానని ఇప్పుడు ఇక్కడకు రావలసిన అవసరం ఏమిటన్నారు. తన కుటుంబ వ్యవహారానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు దువ్వాడ శ్రీనివాస్ .
Discussion about this post