విశాల విశ్వంలో భూమి ఎంత చిన్నదో తెలిపే పాత చిత్రాన్ని నాసా విడుదల చేసింది. దీనిలో భూమి సైజు చిన్న చుక్కలా కనిపిస్తోంది. సూర్యుని నుండి 3.7 బిలియన్ మైళ్ళు అనగా 6 బిలియన్ కిలోమీటర్లు మైళ్ళ దూరంలో, నెప్ట్యూన్‌కు చాలా దూరంగా ఉన్నప్పుడు, వోయేజర్ 1 నిర్వాహకులు చివరిసారిగా ఇంటి వైపు అంటే భూమిని తిరిగి చూడాలని ఆశించి తీసిన చిత్రం ఇది.
మన సౌర కుటుంబ చిత్రాలను 1990 ఫిబ్రవరి 14న అంటే వాలెంటైన్స్ డే న వోయేజర్ 1 వరుసగా 60 చిత్రాలను తీసింది. “ది పేల్ బ్లూ డాట్” అంటే లేత నీలం చుక్కగా భూమి ఆ ఛాయాచిత్రం లో కనిపిస్తోంది. దీనిని నెప్ట్యూన్ వెనుక నుంచి తీశారు. అలాగే అంతరిక్షంలోని యురేనెస్, సాటర్న్, బృహస్పతి, భూమి, వీనస్ లతో కలిసిన సౌరకుటుంబ చిత్రాలను కూడా వోయేజర్ 1 తీసింది. మార్స్, వీనస్ లు కాంతి లేకపోవడంతో కనిపించలేదు. ఫ్లూటో స్పష్టంగా కనిపించలేదు. భూమి మాత్రం సూర్యుడి నుంచి కాంతి పడి మనం ముగ్గుల్లో పెట్టే చుక్కలా నీలం రంగులో కనిపించింది. అయితే ఈ చిత్రాలను తీయడం మిషన్ లో భాగం కాదని నాసా తెలిపింది.
వోయేజర్ టీం లోని కార్ల్ సాగన్ 1994లో రచించిన పుస్తకం పేరును కూడా విశ్వంలో భూమి కనిపించిన అరుదైన చిత్రానికి పెట్టిన పేరు ‘ద పేల్ బ్లూడాట్’ అనే పెట్టారు. 1977లో ప్రారంభించబడిన వోయేజర్ 1లో పంపిన కెమేరాను ఆఫ్ చేసి, కంప్యూటర్ కోసం వినియోగించారు. ప్రస్తుతం వోయేజర్ పనిచేసినప్పటికీ చిత్రాలు తీయలేదు. వోయేజర్ 1 భూమికి 130 ఖగోళ యూనిట్ల దూరంలోని మానవ నిర్మిత యంత్రంగా రికార్డును సాధించింది. 2012 ఆగస్ట్ లో, ఇది నక్షత్రాల మధ్యకు అంటే ఇంటర్ స్టెల్లార్ స్పేస్‌లోకి ప్రవేశించింది. అక్కడి నుంచే అత్యంత విలువైన డేటాను పంపుతోంది. వాయేజర్ 2 ను 1977లో ప్రారంభించారు. ఇది కూడా ఇంటర్ స్టెల్లార్ స్పేస్ వైపు ప్రయాణిస్తోంది. 25 ఏళ్ల క్రితం వాలెంటైన్స్ డే నాటి స్థానంతో పోలిస్తే, వాయేజర్ 1 ఇప్పుడు భూమికి మూడు రెట్లు తక్కువ దూరంలో ఉందని నాసా ధృవీకరించింది. ఈ దూరం నుండి, భూమి దాదాపు పది రెట్లు మసకగా కనిపిస్తోందని నాసా తెలిపింది.
Discussion about this post