గురుగ్రామ్ మార్గంలో ట్రాఫిక్‌ను సులభతరం చేసే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఢిల్లీ-గురుగ్రామ్ ప్రయాణం ఇకపై సులభతరం కానుంది. ఈ ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను స్తంభాలపై నిర్మించగా…. మొత్తం 18 కి.మీల పొడవున ఉన్న ఈ మార్గంలో అనేక అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్లు ఉన్నాయి. మొత్తం ఎనిమిది లైన్లతో ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించారు. ఈ రూటు ఐజీఐ విమానాశ్రయం, గురుగ్రామ్ బైపాస్‌లను కనెక్టివిటీ చేయనుంది.
భారతదేశంలోనే మొట్ట మొదటి 8 లైన్ల ఎక్స్‌ప్రెస్‌వే ఇదే కావడం విశేషం. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో దీన్ని నిర్మించారు. భారతదేశంలోనే ప్రీమియర్ ఎలివేటెడ్ అర్బన్ ఎక్స్‌ప్రెస్ వే కావడం విశేషం. ఎనిమిది లేన్లతో సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్‌ను కలిగి ఉంది. దీన్ని సుమారు 9 వేల కోట్లతో దీన్ని నిర్మించారు. టన్నెల్లు, అండర్‌పాస్‌లు, అట్-గ్రేడ్ రోడ్ సెక్షన్, ఎలివేటెడ్ ఫ్లైఓవర్, ఫ్లైఓవర్ కాన్ఫిగరేషన్పైన ఉన్న ఫ్లైఓవర్‌తో సహా నాలుగు బహుళ-స్థాయి ఇంటర్‌ఛేంజ్‌లను ఈ ఎక్స్‌ప్రెస్‌వే కలిగి ఉంది. మొత్తం ఈ నిర్మాణానికి 2 లక్షల MT ఉక్కు, 20 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వినియోగించారు. 2019. మార్చి 9వ న ఈ ఎక్స్‌ప్రెస్‌వే శంకుస్థాపన జరగగా.. ఐదేళ్ల తర్వాత ఈఅర్బన్ రహదారి అందుబాటులోకి వచ్చింది.
Discussion about this post