ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ ఫిర్యాదుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో టీడీపీ కంప్లైంట్తో మంత్రి జోగి రమేశ్, వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు ఇచ్చారు సీఈవో ముకేష్ కుమార్ మీనా.మార్చి 31న ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచార ప్రసంగంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వైసీపీ ఫిర్యాదు చేసింది. బాబు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ పరుష పదజాలంతో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీఈవో ముకేష్ కుమార్ మీనాకు వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబుకు ఈసీ నోటీసులు ఇచ్చింది. చంద్రబాబు చేసిన ప్రసంగాలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని సీఈవో నోటీసులు జారీ చేశారు. నోటీసులపై స్పందించకుంటే తదుపరి చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తామన్నారు. మరోవైపు తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా స్పందించారు. మంత్రి జోగి రమేశ్, వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు జారీ చేశారు.
Discussion about this post