గాంధీ … ఈ పేరులో అక్షరాలు కేవలం రెండే. ఈ రెండక్ష రాలు ఇపుడు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులకు దడ పుట్టిస్తున్నాయి. మరో 4 రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల గెలుపోటములు డిసైడ్ చేయబోయే ఆ పేరు ఇప్పుడు జిల్లా లో సంచలనం సృష్టిస్తోంది.ఇంతకీ ఎవరీ గాంధీ ? ఏమాయన కథ ? ఆయన నియోజకవర్గం ఏమిటి ? తెలుసుకోవాలంటే మనం శ్రీకాకుళం జిల్లాకు వెళ్లాల్సిందే.. …..
శ్రీకాకుళం జిల్లా ప్రధాన కేంద్రానికి అతి సమీపం లో ఉన్న నియోజకవర్గం ఆముదాలవలస. జిల్లాల్లో రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గం గా ఆముదాల వలస గుర్తింపు పొందింది. ఇక్కడ నుండి గత మూడు ఎన్నికల్లో మామ అల్లుడు మధ్యే ప్రధాన పోటీ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో మాత్రం వారికి ధీటుగా ఇండిపెండెంట్ అభ్యర్థి రంగం లో ఉండటం తో పోటీ రసవత్తరంగా మారిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆముదాలవలస నియోజ కవర్గం నుండి అధికార వైసిపి పార్టీ తరఫున శాసన సభా స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం మూడో సారి ఆ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. ప్రతిపక్ష టిడిపి కి చెందిన కూటమి అభ్యర్థిగా కూన రవికు మార్ తలపడుతున్నాడు. ఆ పార్టీ తరుపున తను కూడా మూడో సారి పోటీ చేస్తున్నాడు. వీరిరువురూ వరసకు మామా అల్లుళ్ళు .. ఈ సారి వీరికి పోటీగా ఇండిపెండెంట్ గా సువ్వార గాంధీ తో పాటు కాంగ్రెస్ పార్టీ తరపున సనపల అన్నాజీ రావులు పోటీ చేస్తున్నారు. అయితే పోటీ ప్రధానంగా వైసిపి, టిడిపి ఇండిపెండెంట్ అభ్యర్థుల మధ్య ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న సువ్వార గాంధీ వైసిపి నేతగా గుర్తింపు పొందారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన గాంధీ సతీమణి సువ్వారి దివ్య తాడివలస ఎంపీటీసీ గా గెలుపొందారు. ఈమె గత టిడిపి ప్రభుత్వం లో పొందూరు మండలం ఎంపీపీ గా కూడా పని చేసారు. గాంధీ మరదలు సువ్వారి స్వర్ణలత జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా పని చేశారు. పార్టీలో తమకు తగిన గుర్తింపు లేదని అధికార వైయస్ఆర్ పార్టీకి రాజీనామాలు చేసి ఇండిపెండెంట్ అభ్యర్థి గాంధీకి మద్ధతుగా పనిచేస్తున్నారు.
సువ్వార గాంధీ పొందూరు మండలం కు చెందిన వ్యక్తి. ఆ మండలం తో పాటు నియోజకవర్గం లో మిగిలిన మండలాలైన ఆముదాలవలస, ఎల్ ఎన్ పేట, బర్జ తో పాటు అముదాల వలస మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి. పొందూరు తో పాటు ఆముదాలవలస మండలం, మున్సి పాల్టీ , ఎల్ ఎన్ పేటలో కూడా సువ్వార గాంధీకి భారీగానే అనుచర గణం ఉంది.. దీంతో పాటు సొంత సామాజిక వర్గం కూడా కలిసి వస్తుందని గాంధీ భావిస్తున్నాడు. ఈ ఎన్నికల్లో ప్రజలు తనకు తప్పక ఆదరిస్తారని చెబుతున్నారు..
సువ్వార గాంధీ 2019 ఎన్నికల్లో వైసిపి తరుపున ఎంఎల్ఏ గా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపించాడు ఆ ఎన్నికల్లో ఆపార్టీ సీనియర్ నేతల తో పాటు ముఖ్యమంత్రి జగన్ కూడా 2024 లో టిక్కెట్ ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని గాంధీ అంటున్నారు.. . ఈ నియోజక వర్గం లో మామ మేనల్లుడు ప్రధాన రాజకీయ పార్టీల తరపున పోటీ చేస్తూ….. అధికారాన్ని వారే సొంతం చేసు కుంటున్నారని ఆరోపిస్తున్నాడు. వారి నుండి నియోజకవర్గ ప్రజలకు విముక్తి కల్పించడానికే తాను రంగం లో ఉన్నానని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.నియోజకవర్గం లో ఇసుక,
మద్యం, వ్యాపారాల్లో ఇద్దరూ బాగ స్వామ్యులేనని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు తనను ఆదరిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో ఉన్న సన పల అన్నాజీ రావు పోటీ నామ మాత్రమే నని రాజకీయ పరిశీలకులు భావిస్తు న్నారు.
ఏది ఏమైనా ఈ సారి ఆముదాలవలస లో వైసిపి టిడిపి పార్టీలకు ఇండిపెండెంట్ అభ్యర్థి చుక్కలు చూపిస్తున్నారు.. సువ్వార గాంధీ ప్రధాన అభ్యర్థుల భవితవ్యం మార్చడం లో కీలకంగా మారుతాడనడంలో సందేహం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Discussion about this post