సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఉపయోగించే అన్ని వాహనాలకు పశ్చిమ బెంగాల్లో జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో లోక్‌సభ ఎన్నికల సమయంలోఅవాంఛనీయ సంఘటనలను అరికట్టడంలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
‘‘ఈవీఎం సహా ఇతర సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించే సమయంలో.. ఎన్నికలు ముగిసిన తర్వాత వాటిని స్ట్రాంగ్‌రూమ్‌లకు తీసుకొచ్చే వరకు పర్యవేక్షించేందుకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను ఉపయోగించనున్నాం. తద్వారా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తాం’’ అని ఎన్నికల సంఘం అధికారి వెల్లడించారు. ఒకవేళ ఏమైనా అవకతవకలు గుర్తిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. డ్రైవర్లు సహా పోలింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులను ప్రశ్నిస్తామన్నారు. పశ్చిమ బెంగాల్లో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు మొత్తం 7 దశల్లో జరగనున్నాయి.
Discussion about this post