చైనా సరిహద్దులోని ఉత్తరాఖండ్ కుగ్రామాలకు దశాబ్దాలుగా విద్యుత్ సౌకర్యానికి నోచుకోలేదు. అయితే త్వరలోనే ఇవన్నీ విద్యుత్ కాంతులు వెదజల్లపోతున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ. 85 కోట్లు కేటాయించింది. మారుమూల ప్రాంతాలైన వ్యాన్స్, దర్మ కొండప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం కల్పిస్తారు.
స్వతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఆయా గ్రామాలకు విద్యుత్ సౌలభ్యం, మౌలిక సదుపాయాలు లేవు. ప్రస్తుతం నేషనల్ గ్రిడ్ కు అనుసంథానం చేసి గ్రామాలకు విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. వ్యాన్ లోయలో అరడజను గ్రామాలకు దర్మ లోయలో మరో డజను గ్రామాలకు విద్యుత్ లేకపోవడంతో సోలార్ విద్యుత్ ను ఆ గ్రామాలు వినియోగిస్తున్నాయి. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ప్రస్తుతం పనులు నిలిపివేశారు. కోడ్ తొలగింపు తర్వాత యధావిధిగా విద్యుత్ పనులు జరగనున్నాయి. ఉత్తరాఖండ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజేంద్ర సింగ్ గంజ్వాల్ మాట్లాడుతూ సరిహద్దు గ్రామాలకు విద్యుత్ సౌకర్యం అత్యవసరం అన్నారు.
Discussion about this post