టెస్లా , SpaceX అధినేత ఎలెన్ మస్క్ , మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తున్న మోడీని ట్విటర్ ద్వారా అభినందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్ లో మీరు మళ్లీ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు అన్నారు. టెక్నాలజీ బిజినెస్ ద్వారా బిలియనీర్ గా మారిన ఎలెన్ మస్క్ త్వరలో భారత్ లో పెట్టుబడులు పెట్టునున్నానని… త్వరలో మా కంపెనీలు మీ దేశంలో పనిచేస్తాయని తెలిపారు.
వాస్తవానికి ఈ ఏడాదిఏప్రిల్ 21, 22ల్లో ఆయన భారత్ లో పర్యటించాల్సి ఉంది. టెస్లా సంస్థలో తీరిక లేకుండా ఉండటంతో భారత్ పర్యటన సాధ్యం కాలేదని ఆయన చెప్పారు. అయితే కొద్ది రోజుల్లో భారత్ లో పర్యటిస్తామని X లో తెలిపారు. గతేడాది జూన్ లో అమెరికాలో ఆయన మోడీని కలిశారు. త్వరలో స్టార్ లింక్ సంస్థను భారత్ లో నెలకొల్పడం ద్వారా భారత్ లో అడుగు పెట్టగలనన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తద్వారా భారీ మొత్తంలో మనదేశంలో పెట్టుబడులు రానున్నాయి. గతేడాది భారత ప్రభుత్వాన్ని సంప్రదించిన టెస్లా వారి వాహనాలపై పన్నురాయితీలను కల్పించాలని కోరింది.
Discussion about this post