మన ఇండియా లోనే కాదు ఈవీఎం ల గురించి అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది .అమెరికాలో 2024 అధ్యక్ష ఎన్నికలకు ముందే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై టెస్లా సీఈఓ, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈవీఎంలను మానవులు లేదా ఏఐ హ్యాక్ చేసే ఛాన్స్ ఉందన్నారు.
ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన టెస్లా సీఈఓ, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ మళ్లీ వార్తల్లో నిలిచారు. అమెరికాలో 2024 అధ్యక్ష ఎన్నికలకు ముందే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై మస్క్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈవీఎంలను మానవులు లేదా ఏఐ హ్యాక్ చేసే ఛాన్స్ ఉందన్నారు. ఇలాంటి క్రమంలో వచ్చే అమెరికా ఎన్నికల నుంచి ఈవీఎంలను తొలగించాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్ష పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ పోస్టుకు టెస్లా CEO ఎలాన్ మస్క్ ఈ విధంగా స్పందించారు.ప్యూర్టోరికో ప్రైమరీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించి వందల సంఖ్యలో ఓటింగ్ అవకతవకలు జరిగాయని అమెరికా అధ్యక్ష అభ్యర్థి కెన్నెడీ జూనియర్ ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. అదృష్టవశాత్తూ పేపర్ ట్రయిల్ ఉండడంతో సమస్యను గుర్తించి ఓట్ల లెక్కింపు సరిచేశారని వెల్లడించారు. పేపర్ ట్రయిల్ లేని ప్రాంతాల్లో ఏమి జరుగుతుందో ఊహించండని పేర్కొన్నారు. ఈ క్రమంలో అమెరికా పౌరులు వారి ప్రతి ఓటు లెక్కించబడిందని తెలుసుకోవడం చాలా ముఖ్యం అని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ జోక్యాన్ని నివారించడానికి పేపర్ బ్యాలెట్ ఉపయోగించాలని కోరారు.భారతదేశంలో, లోక్‌సభ, అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలు సహా వివిధ రకాల ఎన్నికలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇండియాలో కూడా గతంలో ఈవీఎంల గురించి ఆరోపణలు వచ్చాయి. కానీ ఓటరు స్లిప్ ప్రింట్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఆ పుకార్లు తగ్గుముఖం పట్టాయి.
























Discussion about this post