12 శతాబ్దాల నాటి సమాధిని తవ్వుతుండగా బంగారు, విలువైన వస్తువులు బయటపడడంతో శాస్త్రవేత్తలు విస్తుపోయారు. పనామాలో బంగారు నిధులతో ఉన్న సమాధిని పురావస్తు నిపుణులు గుర్తించారు. అక్కడ తవ్వకాలు జరపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పనామా సిటీకి 100 మైళ్ల దూరంలో ఉన్న ఎల్కానో ఆర్కియాలాజికల్ పార్కులో 1200 సంవత్సరాల నాటి సమాధి బయటపడింది. సమాధిలో చాలా వరకూ మృతదేహాల అవశేషాలు బయటపడగా…. వాటితోపాటు పెద్ద ఎత్తున బంగారు నిధి వెలుగులోకి వచ్చింది. ఈ సమాధి లోపల, శాస్త్రవేత్తలు కంకణాలు, బంగారు పూసలతో చేసిన రెండు బెల్టులు, మొసలి ఆకారంలో ఉన్న చెవిపోగులు, బంగారంతో కప్పబడిన స్పెర్మ్ వేల్ దంతాల చెవిపోగులు మరియు వృత్తాకార బంగారు పలకలతో సహా బంగారు నిధుల శ్రేణిని కనుగొన్నారు. దీనిని కోక్లే సంస్కృతికి చెందిన ఉన్నత వర్గానికి చెందిన ప్రభువు సమాధిగా పరిశోధకులు భావిస్తున్నారు. ఇక్కడే మరో 32 మృతదేహాల అవశేషాలు కూడా బయటపడ్డాయి. ఉన్నత వర్గానికి చెందిన ప్రభువు మరణించడంతో అప్పటి ఆచారాల ప్రకారం ఈ 32 మందిని బలి ఇచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 2022లో పురావస్తు ఉద్యానవనంలో త్రవ్వకాలు ప్రారంభమయ్యాయని సాంస్కృతిక మంత్రిత్వ శాఖలోని జాతీయ వారసత్వ డైరెక్టర్ లినెట్ మోంటెనెగ్రో తెలిపారు.
Discussion about this post