చిలకలూరిపేట వద్ద ఉన్న గోపూడి గ్రామంలో ప్రజాగళం ఏర్పాటు చేశామని జనసేన నాయకుడు పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. బీజేపీ- టీడీపీ- జనసేన పార్టీలు ఏర్పాటు చేసిన ఈ బహిరంఘ సభకు దాదాపు 8 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఈ సభలో ముగ్గురు నాయకులు రాష్ట్రానికి ఏం చేయబోతున్నాం అనేది వివరించబోతున్నారని, అధికారం కోసం కాకుండా ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశ్యంలో మూడు పార్టీలు పొత్తుకు వెళ్లాయన్నారు. ఈ సభలను విజయవంతం చేయాల్సిందిగా పంచకర్ల ప్రజలను కోరారు.
Discussion about this post