దుమ్ముగూడెం మండలంలో మిషన్ భగీరథలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారీగా అవినీతి జరిగిందని లక్ష్మీ నగరం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేశారని, అయినప్పటికీ 90 గ్రామాలకు మిషన్ భగీరథ నీరు అందనీయకుండా బిల్లులు వేసుకున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పోదేం వీరయ్య అన్నారు. అవినీతిపై సమగ్రవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్వయంగా ఆయా.. గ్రామాలను పరిశీలించి జరిగిన అవినీతి భాగోతాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని అన్నారు.
Discussion about this post