మిర్చికి గిట్టుబాటు ధర లేదంటూ ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులు ధర్నా చేపట్టారు. అన్నదాతలను అన్ని రకాలగా ఆదుకుంటామని చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలన్నీ వృధా అంటూ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా.. స్పందన లేకపోవడంతో రోడ్డెక్కామన్నారు. మార్కెట్ దళారులు అడ్డంగా దోచుకుంటున్నారని, తమను ఆదుకోవాలని రైతులు మంత్రులు, అధికారులను కోరుతున్నారు.
Discussion about this post