ఫణిగిరి మ్యూజియాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. నాగారం మండలం ఫణిగిరి గుట్ట మ్యూజియం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ఫణిగిరికి ప్రత్యే క స్థానం కల్పిస్తామని అన్నారు. బౌద్ధ సంపద రక్షణకు తెలంగాణ ప్రభుత్వం మొదటిసారిగా ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. గుట్టపై 83 ఎకరాలకుపైగా ఉన్న బౌద్ధ స్థూపం ఆవరణలో తవ్వకాల పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.
Discussion about this post