ప్రాజెక్ట్ డౌట్ అన్నారు.. షూటింగ్ ఆగిపోయిందని ప్రచారం చేశారు. ఎన్నికల తర్వాతే ఏదైనా అని కల్పిత కథలు రాశారు.. కానీ అవన్నీ అబద్ధాలేనని తేలిపోయింది.ఆ సినిమా కోసం హీరో పడుతున్న తపన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏ హీరో ఏ సినిమా లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఇంట్రెస్టెడ్ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్.. గబ్బర్ సింగ్ తో ఆల్ రెడీ టాలీవుడ్ రికార్డులని షేక్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ . సోషల్ మీడియాలో రికార్డులు కూడా కొల్లగొట్టాయి. దీంతో ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని అభిమానుల్లో ఎగ్జయింటింగ్ గా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా ప్రారంభమైన తొలినాళ్లలో స్పీడ్ గా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ కి బ్రేక్ పడింది. అభిమానులకు పండగ లాంటి న్యూస్ ఒకటి చెప్పేశాడు డైరెక్టర్ హరీష్ శంకర్. దీంతో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు.
రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ రీసెంట్ గా సినిమా కోసం కొన్ని రోజులు కేటాయించాడు. దీంతో హరీష్ శంకర్ పవన్ ఇచ్చిన డేట్స్ ను బట్టి షెడ్యూల్ ను ప్లాన్ చేసుకున్నాడట. సినిమా కోసం రోజుకు 14 నుంచి 16 గంటలు కేటాయిస్తానని పవన్ చెప్పడంతో… పక్కాగా ప్లాన్ చేసుకున్నాడట హరీష్ శంకర్. ఎలాంటి రెస్ట్ తీసుకోకుండా నిమిషాల తేడాతోనే వెంట వెంటనే సీన్లును కంప్లీట్ చేశాడట పవన్. ఈ షూట్ పై అదిరిపోయే అప్ డేట్ ను ఇచ్చాడు హరీష్ శంకర్.
రీసెంట్ గా ఉస్తాద్ లో కీలక ఇంటెన్స్ పార్ట్ ని కంప్లీట్ చేసానని పవన్ ఇరగదీశాడని హరీష్ ఒక ఎగ్జైటింగ్ అప్డేట్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకోగా వైరల్ గా మారింది. ఈ సినిమాకి పవన్ ఇంకా సుమారు 15 రోజులు పవన్ కళ్యాణ్ కేటాయిస్తే సినిమా పూర్తి అయిపోతుందని కూడా అంటున్నారు. ఈ విషయం తెలిసిన పవన్ ఫ్యాన్స్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
Discussion about this post