స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. అల్లు అర్జున్ డాన్స్‌కు యూత్‌లో మాంచి క్రేజ్ ఉంది. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన బన్నీ స్వల్ప వ్యవధిలోనే తన సత్తా చాటుకున్నాడు. వైవిధ్యభరితమైన సినిమాలతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన బన్నీ.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఇవాళ అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అలాగే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్న తొలి తెలుగు హీరో బన్నీ కావడం విశేషం. అల్లు అర్జున్ 1982 ఏప్రిల్ 8న జన్మించారు. దివంగత నటుడు అల్లు రామలింగయ్య మనవడిగా.. గీతా ఆర్ట్స్ అధినేత.. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.ప్రస్తుతం పుష్ప 2 లో అర్జున్ నటిస్తున్నారు. పుట్టిన రోజు సందర్బంగా పుష్ఫా 2 టీజర్ ను విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
Discussion about this post