నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైస్ మిల్లర్లు సిండికేట్ అయ్యారు. తాము చెప్పిన ధరకే ధాన్యం అమ్మాలని రైతులకు హుకుం జారీ చేస్తున్నారు. రెండు రోజులుగా గేట్లకు తాళాలు వేసి ధాన్యం కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన రైతన్నలు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. సమస్యపై ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
Discussion about this post