రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర కేంద్రం ప్రకటించాలని రైతు రక్షణా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరి రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శ్రీ రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ లో హుస్నాబాద్ డివిజన్ రైతు రక్షణ సమితి సమావేశం జరిగింది. రైతు రక్షణ సమితి అధ్యక్షులు అయిలేని మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా వచ్చిన రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరి రావు మాట్లాడారు. దేశ జనాభాలో 50 శాతం ఉన్న రైతులు, రైతుకూలీలు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రైతు సమస్యలను పరిష్కరిస్తామనే పార్టీలనే సపోర్టు చేయాలని శ్రీహరి చెప్పారు. ఈ సమావేశంలో హుస్నాబాద్ డివిజన్ రైతు రక్షణ సమితి ఎన్నికలు జరిగాయి.
Discussion about this post