వైసీపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఉందని మాజీ మంత్రి కాలువశ్రీనివాసులు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయదుర్గం నియోజక వర్గంలోని పులకుర్తి గ్రామంలో ఆయన పర్యటించారు. రాయదుర్గంలో టీడీపీ అభ్యర్థి శ్రీనివాసులకు ఘన స్వాగతం లభించింది. పులకిర్తి గ్రామంలో జరిగిన శంఖారావసభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ గెలుపుతో ఆ పార్టీతో పోటీపడేందుకు ప్రతిపక్షాలు భయపడే పరిస్థితి రావాలన్నారు. రాయదుర్గం టీడీపీ కంచుకోట అని ఎవరు పోటీపడినా ..తెదేపా విజయాన్ని ఆపలేరని సవాలు చేశారు. అవినీతి ప్రభుత్వం, అసమర్ధ ప్రభుత్వం, రైతు ద్రోహి ప్రభుత్వం, జగన్ ప్రభుత్వమే అన్నారు.
Discussion about this post