బాలీవుడ్ ప్రతిష్ఠాత్మకంగా భావించే 69వ ‘ఫిల్మ్‌ఫేర్’ లో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట పండింది. ఈ చిత్రానికి మూడు విభాగాల్లో అవార్డులు వరించాయి. గుజరాత్‌లోని గాంధీనగర్ వేదికగా వైభవంగా జరిగిన ఈ వేడుకలో విజేతలను ప్రకటించారు. ఈ కార్యక్రమానికి కరణ్ జోహార్ హోస్టుగా వ్యవహరించగా బాలీవుడ్ తారలు వేదికపై సందడి చేశారు. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి రణ్‌బీర్‌కపూర్, అలియాభట్ జంటకు ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులు వరించాయి.
ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ, ప్రీతం పాండే జీవిత కథల ఆధారంగా రూపొందించిన ’12th ఫెయిల్’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ చిత్ర దర్శకుడు విద్దు వినోద్ చోప్రా బెస్ట్ డైరెక్టర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. నటుడు.. గాయకుడు.. సంగీతం .. నేపథ్య సంగీతం.. సౌండ్ డిజైన్ ఇలా మొత్తం ఐదు విభాగాల్లో ‘యానిమల్’ అవార్డులు అందుకుంది. `12 త్ ఫెయిల్` కూడా ఐదు విభాగాల్లో అవార్డులు అందుకుంది. `రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ` చిత్రం నాలుగు అవార్డులు దక్కించుకుంది. ఈ వేడుకలో కరీనా కపూర్.. కరిష్మా కపూర్.. వరుణ్ ధావన్.. కార్తీక్ ఆర్యన్ పెర్ఫార్మన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
69వ ఫిల్మ్ ఫేర్ అవార్డు విజేతలు
బెస్ట్ మూవీ : 12త్ ఫెయిల్ ఉత్తమ సినిమా (విమర్శ): జోరామ్ బెస్ట్ డైరెక్టర్: విధు వినోద్ చోప్రా (12త్ ఫెయిల్)
బెస్ట్ యాక్టర్: రణబీర్ కపూర్ (యానిమల్)
ఉత్తమ నటి: ఆలియా భట్ (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): విక్రాంత్ మెస్సీ
(12త్ ఫెయిల్) ఉత్తమ నటి (క్రిటిక్స్): రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే) ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్ (డంకీ) ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని)
బెస్ట్ లిటరేచర్ : అమితాబ్ భట్టాచార్య (తేరే వాస్తే పాట – జరా హట్కే జరా బచ్కే)
బెస్ట్ మ్యూజిక్ : యానిమల్ (ప్రీతమ్, విశాల్ మిశ్రా, మన్నన్ భరద్వాజ్, శ్రేయాస్ పురానిక్, జానీ, భూపిందర్ బాదల్, అశిమ్ కెమ్సన్, హర్షవర్ధన్ రామేశ్వర్, గురిందర్ సెహగల్)
బెస్ట్ సింగర్ : భూపిందర్ బాదల్ (అర్జన్ వ్యాలీ – యానిమల్)
బెస్ట్ గాయని: శిల్పా రావు (బేషరమ్ రంగ్ – పఠాన్)
బెస్ట్ స్టోరీ : అమిత్ రాయ్ (ఓ మై గాడ్ 2)
బెస్ట్ స్క్రీన్ ప్లే : విధు వినోద్ చోప్రా (12త్ ఫెయిల్)
బెస్ట్ డైలాగ్స్ : ఇషితా మొయిత్రా (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని)
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: హర్షవర్ధన్ రామేశ్వర్ (యానిమల్)
బెస్ట్ యాక్షన్ : స్పారో రజాటోస్, ANL అరసు, క్రేగ్ మాక్రే, యానిక్ బెన్, కెచా ఖమ్ ఫక్డీ, సునీల్ రోడ్రిగ్స్ (జవాన్)
బెస్ట్ ఫోటోగ్రఫీ: అవినాష్ అరుణ్ ధావరే (త్రీ ఆఫ్ అస్ )
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: సుబ్రతా చక్రవర్తి, అమిత్ రే (సామ్ బహదూర్)
కాస్ట్యూమ్ డిజైన్ : : సచిన్ లవ్లేకర్, దివ్య గంభీర్, నిధి గంభీర్ (సామ్ బహదూర్)
ఉత్తమ శబ్ద కూర్పు: కునాల్ శర్మ (సామ్ బహదూర్) & సింక్ సినిమా (యానిమల్)బెస్ట్ ఎడిటింద్ : జస్ కున్వర్ సింగ్ కోహ్లీ, విధు వినోద్ చోప్రా (12వ ఫెయిల్)
ఉత్తమ వీఎఫ్ఎక్స్: రెడ్ చిల్లీస్ VFX (జవాన్) బెస్ట్ కొరియోగ్రఫీ: గణేష్ ఆచార్య (‘వాట్ ఝుమ్కా’ పాట – రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ)
Discussion about this post