ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 అభిమానులను బాగా అలరిస్తుంది. లీగ్‌లో ప్రతిరోజూ అద్భుతమైన మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్లో బ్యాట్స్‌మెన్స్ ఆధిపత్యం చెలాయిస్తూ… సిక్సర్ల వర్షం కురిపిస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ బ్యాట్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు వచ్చాయి. భారీ షాట్లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. IPL చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
ప్రస్తుత సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ బ్యాట్ నుంచి సిక్సర్ల వర్షం కురుస్తోంది. ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడి మూడు హాఫ్ సెంచరీల సాయంతో 467 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు అతని బ్యాట్ నుంచి 41 సిక్సర్లు నమోదయ్యాయి. ఐపీఎల్లో ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ విషయంలో వెటరన్ RCB బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని అభిషేక్ వెనక్కి నెట్టాడు. ఐపీఎల్ 2016లో విరాట్ కోహ్లీ ఒక సీజన్లో 38 సిక్సర్లు కొట్టి బ్యాట్‌తో అద్భుతాలు చేశాడు. అయితే, ఇప్పుడు అభిషేక్ శర్మ ఈ రికార్డును తిరగరాశాడు. ఐపీఎల్లో ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్మెన్ల జాబితాలో రెండో స్థానంలో నిలవగా…విరాట్ కోహ్లీ పేరు కూడా జాబితాలో మూడో స్థానంలో ఉంది. ప్రస్తుత సీజన్లో కోహ్లీ ఇప్పటివరకు 37 సిక్సర్లు బాదాడు. ఇక ఈ సీజన్ లో రెండు జట్లు ప్లేఆఫ్ చేరుకోవడంతో ఇద్దరికీ రికార్డు మార్చుకునే అవకాశం ఉంది.
ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్మెన్ల జాబితాలో రిషబ్ పంత్ పేరు కూడా ఉంది. 2018 ఐపీఎల్లో పంత్ అద్భుతంగా ఆడి 37 సిక్సర్లు బాదాడు. అదే సమయంలో, దీని తర్వాత శివమ్ దూబే పేరు తెరపైకి వస్తుంది. అతను IPL 2023లో 35 సిక్సర్లు కొట్టి బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ గా క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. RCB తరపున ఆడుతున్నప్పుడు, అతను IPL 2012లో 59 సిక్సర్లు కొట్టాడు. ఇప్పటి వరకు ఏ బ్యాట్స్‌మెన్ కూడా గేల్ రికార్డును బద్దలు కొట్టలేకపోయాడు.
Discussion about this post