తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇవాళ కన్నుమూశారు. రెండు రోజుల క్రితం గుండెపోటుతో నగరంలోని యశోదా ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగులో తొలిసారి వార్తలు చదివిన ఆయన.. వీక్షకులపై చెరగని ముద్రవేశారు. పదేళ్లపాటు టెలీప్రాంప్టర్ లేకుండా పేపర్ చూసి వార్తలు చెప్పేవారు. 1983 నవంబర్ 14 నుంచి దూరదర్శన్‌లో వార్తలు చదవడం ప్రారంభించారు.తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు ఆయనది. 2011లో పదవీ విరమణ చేసేవరకు దూరదర్శన్‌లో పనిచేశారు. లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. శాంతిస్వరూప్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సాహిత్యంపై పట్టున్న శాంతి స్వరూప్.. భోపాల్ గ్యాస్ దుర్ఘటన మీద ‘‘రాతి మేఘం’ అనే నవల రాశారు.
Discussion about this post