ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో డాక్టర్, డాక్టరమ్మల మధ్య పొలిటికల్ వార్ ఆసక్తికరంగా మారింది .. దర్శి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఒక ప్రధాన పార్టీ నుంచి మహిళా అభ్యర్థి ఎన్నికల బరిలోకి దిగారు.. టీడీపి, జనసేన, బీజేపి ఉమ్మడి అభ్యర్ధిగా టీడీపీ నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి టికెట్ కేటాయించారు … ఇప్పటికే వైసీపీ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు … ఆ ఇద్దరు డాక్టర్లు మంచి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారే అవ్వడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో మిత్రపక్షాల నుంచి ఎవరు పోటీ చేస్తారు?.. ఏ పార్టీకి ఆ సీటు దక్కుతుంది? అన్నదానిపై పెద్ద చర్చే నడిచింది … దర్శి టీడీపీకి ఇన్చార్జ్ని కూడా నియమించకపోవడంతో … పొత్తుల్లో భాగంగా అది జనసేనకు కేటాయిస్తారన్న వాదన వినిపించింది… అయితే చివరికి అక్కడ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభ్యర్ధిని ప్రకటించారు.. దర్శి టీడీపీ ఫైనల్ లిస్ట్‌లో మిత్రపక్షాల అభ్యర్ధినిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పేరు ఖరారు చేశారు .. దాంతో నిన్నమొన్నటి వరకు స్థబ్దతగా ఉన్న దర్శి రాజకీయం ఒక్కాసారిగా మారిపోయింది…
దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్లి వేణుగోపాల్‌ను పక్కనపెట్టిన వైసీపీ ఈసారి అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే, డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ప్రకటించింది … అటు కూటమిలోనూ అభ్యర్ధిపై గందరగోళం తొలగిపోవడంతో .. టీడీపీ కేడర్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది…నిన్నటి వరకు ప్రజల నాడి పట్టిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఇప్పుడు పొలిటికల్ పల్స్ పట్టడానికి రెడీ అయ్యారు .. పల్నాడు జిల్లా నరసరావుపేటలో డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్న లక్ష్మి… దివంగత మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు అవుతుంది.
Discussion about this post