ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో డీఎస్పీ కార్యాలయంలో ఎలక్షన్ లపై ప్రెస్ మీట్ నిర్వహించారు. డీఎస్పీ రామారావు మాట్లాడుతూ….రాష్ట్ర అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని అన్నారు. పోటీ చేసే అభ్యర్థులు, కార్యకర్తలకు ఎన్నికల ప్రచారంలో భాగంగా సువిధ పోస్టల్ ద్వారా అనుమతి తీసుకోవాలని అన్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లకు, ఇంటింటి ప్రచారాలకు, ఊరేగింపులకు అనుమతులు తీసుకోవాలని చెప్పారు.
Discussion about this post