అక్రమంగా అరెస్టు చేసిన సాయిలుని వెంటనే విడుదల చేయాలి
అటవీ అధికారులు తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మెదక్ జిల్లా హవేలీ ఘన్ పూర్ మండలం, గాజిరెడ్డి పల్లి గ్రామాల రైతులు వాపోతున్నారు. ఈ రైతులంతా మెదక్ ఫారెస్టు రేంజ్ కార్యాలయం ఎదుట బీఆర్ ఎస్ నాయకులతో కలసి ధర్నా నిర్వహించారు. గ్రామానికి చెందిన బీఆర్ ఎస్ నాయకులు సాయిలును అటవీ అధికారులు అరెస్టు చేశారని వెంటనే విడుదల చేయాలని రైతులు డిమాండు చేశారు. అయితే అతనికి స్టేషన్ బెయిలు ఇచ్చి విడుదల చేశామని అటవీ అధికారి చెప్పారు.
Discussion about this post