ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున హింస చెలరేగింది. వైసీపీ, టీడీపీ శ్రేణులు చాలా చోట్ల గొడవలకు దిగాయి.. కొన్ని చోట్ల భీభత్సంగా గొడవలు పడ్డారు కూడా. ఇక దీనిపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది… ఏపీ డీసీపీ, సీఎస్‌లు కూడా ఢిల్లీ వెళ్లి వివరణ కూడా ఇచ్చారు… అంతే కాదు కొందరు అధికారుపై బదిలీ వేటు కూడా పడింది. ఇక తాజాగా ఈ ఘటలపై సిట్ విచారణ చేపడుతున్నారు.
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో పోలింగ్ రోజు, ఆ తర్వాత కూడా చెలరేగిన హింసపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటైంది. ఏడీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ నియామకం అయ్యింది. ఇప్పటికే ప్రాథమిక విచారణ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈసీకి సిట్ నివేదిక అందివ్వనున్నట్టు సమాచారం. పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలోని జరిగిన ఘటనలపై నివేదిస్తారు. సిట్ నివేదిక ఆధారంగా ఈసీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఈసీ ఆదేశాలతో హింసాత్మక ఘటనలకు కారకులైన వారిని అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తోన్నట్లు తెలుస్తోంది.
కొందరు అభ్యర్థులతో పోలీసులు కలిసిపోయారనే దానిపై కూడా ఈసీ చర్యలు తీసుకునే అవకాశముంది. హింసాత్మక ఘటనలు జరిగిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను గృహ నిర్బంధం విధించారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఇళ్ల వద్ద సాయుధ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. అదనంగా 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని దేశించిగా.. ఇప్పటికే రాష్ట్రానికి 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు చేరుకున్నాయి. కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లను సీఈవో పరిశీలింస్తారు.
Discussion about this post