వెల్దండ పోలీస్ స్టేషన్ ముందు కార్యకర్తల ఆందోళన
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజును పోలీసులు అడ్డుకుని నిర్బంధించటం ఉద్రిక్తతకు దారితీసింది. హాజీపూర్ వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల సమావేశాలు ఒకేరోజు ఉండటంతో బాలరాజు అక్కడికి వెళ్లకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో వెల్దండ పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. తనను అడ్డుకోవడంపై గువ్వల బాలరాజు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన నియోజకవర్గంలో ఇలా జరగటం తగదని, ఇలాంటి దుర్మార్గాలను నియంత్రించడంలో సీఎం విఫలమయ్యారని విమర్శించారు.
Discussion about this post