మణుగూరు ప్రభుత్వ కళాశాల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రభుత్వ కళాశాలలో అంతర్గత సీసీ రోడ్లకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ తాను చదివిన ప్రభుత్వ కళాశాలలో సుమారు రూ.23 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లకు భూమిపూజ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ నెల 28 నుంచి విద్యార్థులకు పరీక్షలు ఉన్నందున రోడ్లను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు అధిక మార్కులు సాధించి మణుగూరు కళాశాలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే కోరారు.
Discussion about this post