మంగళగిరిలో బసవతారకం ఇండో- అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన ఉచిత కేన్సర్ నిర్థారణ శిబిరాన్ని నందమూరి వసుంధరతో కలసి నారా బ్రాహ్మిణి ప్రారంభించారు. కేన్సర్ తో ప్రాణ నష్టం జరకూడదని ప్రతి ఒక్కరు నిర్థారణ పరీక్షలు చేసుకుని తగిన సమయంతో చికిత్స పొందాలనే ఉద్దేశ్యంతో స్వర్గీయ ఎన్టీఆర్తన భార్య బసవతారకం పేరుతో ఆస్పత్రిని నెలకొల్పారని ఆమె తెలిపారు. బసవతారకం ఇండో- అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి ద్వారా ఇప్పటి వరకూ 2 లక్షల మందికి నిర్దారణ పరీక్షలు చేశామని బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆసుపత్రి సీఈవో కృష్ణయ్య తెలిపారు. కేన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే సరైన వైద్యంతో తిరిగి ఆరోగ్యం పొందవచ్చని ఆయన అన్నారు.
Discussion about this post