సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని సీవీ రామన్ స్కూల్లో రేణుక ఎల్లమ్మ లయన్స్ క్లబ్ వారి ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. రేన హాస్పిటల్ వైద్యులు ఇక్కడ ఉచితంగా సేవలను అందిస్తున్నారని హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం అన్నారు. కరీంనగర్ లోని లయన్స్ క్లబ్ సభ్యత్వాన్ని హుస్నాబాద్ కి మార్చుకుంటానని, తన తండ్రి జ్ఞాపకార్థం వైకుంఠ రథమును సమకూర్చుతానని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్, ఆర్డీవో లతో మాట్లాడి లయన్స్ క్లబ్ కార్యకలాపాలకు కావలసిన వసతులు ఏర్పాటు చేపిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని మంత్రి తెలిపారు.
Discussion about this post