ట్రంప్ బడాయి మాటల కోరని ఆయన గురించి తెలిసినవారంతా చెబుతుంటారు. అదే విషయం మరోసారి నిరూపిత మయ్యింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తో తనకు సత్సంబంధాలుండేవన్నారు. తనకంటే ముందు అమెరికా అధ్యక్ష పదవిని నిర్వహించిన బరాక్ ఒబామా అమెరికాకు ఒకే ఒక ముప్పుగా నార్త్ కొరియాను హెచ్చరించారన్నారు. తన పదవీ కాలంలో వ్యక్తిగతంగా ఉన్ తో అనుబంధాన్ని పెంచుకున్నానని ట్రంప్ తెలిపారు. దీంతో తమ మధ్య ఉద్రిక్తతలు తగ్గాయని అందమైన ఫ్రెండ్ షిప్ కుదిరిందన్నారు. 2016లో పొరపాటున హిల్లరీ క్లింటన్ విజయం సాధించి ఉంటే ప్రపంచం అణు యుద్ధాన్ని ఎదుర్కొనేదన్నారు.
మొదట్లో ఇద్దరం ఒకరినొకరం విమర్శించుకుంటూ వ్యక్తిగతంగా తూలనాడుకున్నామన్నారు. అయితే రాను రాను మా మధ్య సంబంధాలు మార్పు చెందాయని ట్రంప్ తెలిపారు. ఆయన నాకు గౌరవం ఇచ్చేవాడు.. నేను ఆయనకు గౌరవం ఇచ్చే వాడిని అన్నారు. ఆయనను వెరీ స్మార్ట్ గై , వెరీ స్ట్రాంగ్ గై అని పిలిచే వాడినన్నారు. ఆ దేశానికి తగిన నాయకుడని ట్రంప్ ఉత్తర కొరియా అధ్యక్షుడు ఉన్ ను పొగిడారు. మా ఇద్దరికి కెమిస్ట్రి కుదరడంతో మేమిద్దరం ప్రేమలో పడిపోయామని రచయిత బాబ్ వుడ్ వర్డ్ తో చెప్పారు. మనం ఎవరినైనా కలసుకున్నప్పుడు వారితో మంచి కెమిస్ట్రి ఉంటే అన్ని సమస్యలు తీరతాయన్నారు. ఏ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా ఇనుప పిడికిలతో పాలిస్తున్న దేశం ఏమన్నా ఉందంటే అది అది ఉత్తర కొరియా యే. రాజకీయ ఖైదీలు, బలవంతపు లేబర్ శిబిరాల ముప్పులో ఉన్న దేశం ఉత్తర కొరియా మాత్రమే. క్రూరపాలన అందించే ఉన్ తో స్నేహం ఏమిటని ట్రంప్ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.
డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ల మధ్య జరిగిన మాటల యుద్ధం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. ఉత్తర కొరియాను భూస్థాపితం చేస్తామని ట్రంప్.. అమెరికాపై అణుదాడి చేస్తామని కిమ్ పరస్పర హెచ్చరికలు చేసుకున్నారు. ట్రంప్, కిమ్ చర్యలు ఎటు దారితీస్తాయోనని యావత్తు ప్రపంచ ఆందోళన చెందింది. రెండేళ్ల పాటు ఉప్పు నిప్పులా ఉన్న నేతలు చివరకు శాంతించడంతో వివాదం సద్దుమణిగింది. ఉత్తర కొరియాను సర్వనాశనం చేస్తామని హెచ్చరించిన ట్రంప్.. ఇప్పుడు కిమ్‌ను ప్రశంసించడం గమనార్హం. గతంలో కిమ్‌ను ‘సిక్ పప్పీ’ అని తిట్టిన ట్రంప్.. ఇప్పుడు అదే పప్పీతో ప్రేమలో పడిపోవడం విశేషం. ఇదిలా ఉండగా, అమెరికా విషయంలో తన వైఖరి ఎప్పటికీ మారబోదని, ఎప్పటికీ తమకు శత్రు దేశమేనని కిమ్ చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటుంది.
Discussion about this post